నిజాంపేట,సెప్టెంబర్3 : వివిధ కారణాలతో నిజాంపేటకు చెందిన భూమయ్య చల్మెడకు చెందిన ఎల్లయ్య ఇటీవలే మృతి చెందారు. విషయం తెలుసుకున్న డాక్టర్ మోహన్ నాయక్ బుధవారం బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 25 కిలోల బియ్యం చొప్పున అందజేశారు.
అనంతరం చల్మెడ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి చేతికి గాయం కాగా అతని పరామర్శించారు. నిజాంపేట ఎస్సీ కాలనీలో స్ట్రీట్ లైట్లను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్, గ్రామ అధ్యక్షుడు కోమట బాబు, పంజా మహేందర్, రాజు నాయక్ బాబు నాయక్ శ్రీనివాస్ సుధాకర్ తదితరులు ఉన్నారు.