రామాయంపేట, మే 05 : పారిశుధ్య, బీడీ, మున్సిపల్ తదితర అణగారిన వర్గాలకు ఉత్తమ సేవలం దించాలని డాక్టర్ హేమరాజ్సింగ్ అన్నారు. సోమవారం రామాయంపేటలోని సీఐటీయు జిల్లా మహాసభలను దిగ్విజయం చేసిన జిల్లా సీఐటీయు అధ్యక్షురాలు బాలమణిని అభినందించారు. అనంతరం ఆడయన మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన బాలమణి ముందు ముందు రోజుల్లో ప్రజలు, కార్మికుల సేవల్లోనే కొనసాగాలని ఆకాంక్షించారు.
నిస్వార్ధం లేకుండా కార్మికులకు సేవలు చేస్తే వారు జీవితకాలం గుర్తుకు చేసుకుంటారన్నారు. బాలమణి చేసే ఉద్యమాలకు తాను వ్యకితగతంగా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మాసుల రామరారాజు , మాసుల లింగం, బసన్నపల్లి మల్లేశం తదితరులు ఉన్నారు.