రామాయంపేటలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధమయ్యాయి. రేపు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా 304 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీతో పాటు గొల్పర్తి, కోమటిపల్లి, కోమటిపల్లి తండా, రామాయంపేట తండాల్లో అర్హులైన వారిని గుర్తించి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. సొంతింటి కల ఎట్టకేలకు నెరవేరబోతుండడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-రామాయంపేట, ఏప్రిల్ 3
రామాయంపేట, ఏప్రిల్ 3 : పట్టణంలోని నిరుపేదల సొంతింటి కల సాకారంకానున్నది. బుధవారం మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి లబ్ధ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు. రామాయంపేట పట్టణానికి ఆనుకొని ఉన్న జాతీయ రహదారి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు అన్ని సౌకర్యాలతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అర్హులైన 18 మందికి జర్నలిస్టులకు సైతం డబుల్ బెడ్ రూమ్‌లను అందజేయనున్నారు. వారితో పాటు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎంపిక చేసిన వారికి కూడా నూతన గృహప్రవేశాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. 5 తేదీన (రేపు) ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అర్హులైన 304 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు.
డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక
ఇండ్లు లేని నిరుపేదలకు రేపు మంత్రి ఇండ్ల పట్టాలు అందజేయనున్నారు. పురపాలికలో ఎవరికీ అన్యాయం జరుగవద్దనే ఉద్దేశంతోనే డ్రాపద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాం. సొంత స్థలం ఉంటే ప్రభుత్వం రూ. 3 లక్షలు మంజూరు చేస్తుంది.
-జితేందర్‌గౌడ్, పురపాలిక చైర్మన్
ఇండ్లులేని వారినే గుర్తించాం
రామాయంపేట మున్సిపల్‌తో పాటు గొల్పర్తి, కోమటిపల్లి, కోమటిపల్లి గిరిజన తండా, రామాయంపేట గిరిజన తండాలో అర్హులైన లబ్ధ్దిదారులను మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ పద్ధతిన డ్రా తీశాం. రామాయంపేట మున్సిపల్ వ్యాప్తంగా ఎవరికీ ఎలాంటి అన్యా యం జరుగకుండా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. ఒకవేళ ఇళ్లున్న వారికి డబుల్ బెడ్రూమ్ వస్తే కచ్చితంగా ఫిర్యాదు చేయాలి.
-పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
సొంత స్థలం ఉంటే రూ.3 లక్షలు
లాటరీలో ఇల్లు రాని వారు కలత చెందవద్దు. ఒకవేళ లాటరీలో ఇండ్లు వచ్చిన వారికి ఇల్లు గనక ఉంటే వారిపై పురపాలికలో ఫిర్యాదు చేయవచ్చు. సొంత స్థలం ఉన్న వారికి సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా రూ.3లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ప్రజలెవరూ నిరుత్సాహపడొద్దు. మెదక్‌లో కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో చేతుల మీదుగానే లబ్ధిదారులను ఎంపిక చేశాం.
-దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్