Collector Rahul Raj | మెదక్ రూరల్, అక్టోబర్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని 33 /11 సబ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, సబ్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు.
ధాన్యం సేకరణ తీరును, మాశ్చరైజేషన్ను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఏ విధంగా సరఫరా అవుతుందో ఎన్ని గంటలు రైతులకు అందిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో మాయిచ్చరైజేషన్ అయిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని తెలిపారు.
టోకెన్ అందించడంతోపాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు. ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని వెల్లడించారు. నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Read Also :
Jigris Release Announcement | విడుదల తేదీని ప్రకటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’
Nara Rohith | మొదలైన నారా రోహిత్ పెళ్లి పనులు.. హల్దీ వీడియో వైరల్