Fire Accidents | రామాయంపేట, ఏప్రిల్ 16 : అగ్నిప్రమాదాలపై ఎలాంటి నిర్లక్ష్యం చూపించొద్దని అగ్నిమాపక శకట సిబ్బంది ప్రజలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ రామాయంపేట పట్టణంలోని పలు వార్డుల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకునే చర్యల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
అగ్ని ప్రమాదాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తే వెంటనే నిమిషాల్లో మీ ముందు ఉంటామని సిబ్బంది పేర్కొన్నారు. పట్టణంలోని తమ ఇండ్లలోగానీ, ఇతర ప్రాంతాల్లో సైతం ఎక్కడా అగ్ని ప్రమాదం సంభవించినా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
అనంతరం అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో వాటిని నివారించే పద్దతులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారం రోజుల పాటు ప్రభుత్వం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించ తలపెట్టిందని వారం రోజుల్లో తమ పరిధిలో ఉన్న గ్రామాలన్నింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్మెన్లు చంద్రాగౌడ్, ప్రవీణ్, సత్య, నర్సగౌడ్, శంకర్ తదితరులు ఉన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్