మెదక్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్‌తో కలసి మాట్లాడారు.
సిట్ విచారణ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రతీకార రాజకీయాలకు తెరతీశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుం చి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అమ లు చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడంతో సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి నోటీసులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేసి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, మామిళ్ల ఆంజనేయులు, జుబేరు అహ్మద్, గౌస్ ఖురేషి, సున్నం నరేశ్ పాల్గొన్నారు.