సిద్దిపేట, అక్టోబర్ 16: సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌కు మరో ఐదు పడకలు మం జూరైనట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం హైదరాబాదు తర్వాత సిద్దిపేటలోనే తొలి డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటినుంచి అనేకమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ సెంటర్లో డయాలసిస్ సేవలు అందిస్తున్నారన్నారు. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరగడంతో డయాలసిస్ సెంటర్లో మరో ఐదు బెడ్లను కొత్తగా మంజూరు చేశారని, త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తో సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు పడకలతో 20 17లో డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. రోగుల విజ్ఞప్తి మేరకు 2019లో మరో ఐదు పడకలు మంజూరయ్యాయి. ఈ సెంటర్లో ప్రస్తుతం వందల మంది రోగులు డయాలసిస్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. గతేడాది 78,800 మంది డయాలసిస్ సేవలను పొందారు.