Edupayala temple | పాపన్నపేట, ఆగస్టు 10 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, బ్రహ్మచారి, ప్రతాపరెడ్డి, బత్తిని రాజు, వారుణాచారి, నర్సింలు, నరేష్, యాదగిరి తదితరులు తగిన ఏర్పాట్లు చేశారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన