Edupayala Durgamma | పాపన్నపేట, జూలై 27 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వన దుర్గ భవాని దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, బోనాలు సమర్పించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం తగిన బందోబస్తు చర్యలు చేపట్టింది.
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి