rice paddy fields | రామాయంపేట, జూలై 16 : వరి నారు మడుల్లో నీరు ఎక్కువగా ఉంటే వరి నాటుకు పనికి రాకుండా పోతుందని.. అందుకోసం రైతులు వరినారు మడుల్లో ఎక్కువగా నీటిని ఉంచవద్దని రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్నారాయణ అన్నారు.
బుధవారం రామాయంపేట శివారు ప్రాంతంలోని వరినాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం పంట వద్దే రైతులకు పలు సూచనలు చేశారు. వరినాట్లపై రైతులు ప్రత్యేక శ్రద్ద కనబరచాలన్నారు. మడుల్లో నాట్లు వేసే ముందు కూడా వరి కొనలను కత్తిరించి నాట్లను వేయాలన్నారు. అంతేగాకుండా కొద్ది రసాయనాల్లో వరికొనలను ముంచి నాటుకు తీసుకెళ్లాలన్నారు.
రైతులకు ఏమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నేరుగా మండలాల్లోని వ్యవసాయ కార్యాలయాల్లోగాని లేక రైతు వేదికలో కానీ ఉండే ఏఈవోలను సంప్రదించాలన్నారు. వరి పంటలకు రసాయనాలను మోతాదులో చల్లాలని.. లేకుంటే దిగుబడి తక్కువ వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు.
వరికి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రాజు, సాయికృష్ణ, సందీప్, రాజు తదితర రైతులు ఉన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం