మెదక్(నమస్తే తెలంగాణ)/సిద్దిపేట కలెక్టరేట్/సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 3: రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మార్చి 2025నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ధరణి పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ నుంచి, భూపాల్పల్లి జిల్లా ఐడీఓసీ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలి సి కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020నాటి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి నష్టం కలుగకుండా అధికారులు పరిష్కరించాలన్నారు.
ఎకడా ప్రభుత్వభూమికి నష్టం కలగవద్దని, నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు గురికాకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్రూటినీ కోసం జిల్లా కలెక్టర్లు వారి పరిధిలోని ప్రతి గ్రామానికి, మున్సిపాలిటీకి ఆర్ఐ, నీటిపారుదల శాఖ అసిస్టెం ట్ ఇంజినీర్లు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకర ణ కోసం ఆగస్టు మొదటి వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి రాబోయే 3 నెలల వ్యవధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.
రెండోదశలో సదరు దరఖాస్తులు స్థానిక సం స్థల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా, రోడ్డు వెడల్పు ఓపెన్ స్పేస్ మొదలగు నిబంధనలు లేఔట్లో పాటించారా అనే అంశాన్ని పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారి ఆమోదిస్తారని, వెంటనే ఎల్ఆర్ఎ ఫీజు జనరేట్ అవుతుందని, దీనిని దరఖాస్తుదారులకు తెలియజేయాలని, ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వా త మూడోదశకు దరఖాస్తులు వెళ్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్ఆర్ఎస్పై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు-20 24పై ప్రజల నుంచి పూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్ (www.ccla.telangana.gov.in) ద్వా రా అవకాశం కల్పించామని వీసీలో ఆయన వెల్లడించారు. ఈనెల 2 నుంచి 23 వరకు అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియాలన్నా రు.
సలహాలు సూచనలకు ఈమెయిల్ (ror 2024-rev<\@>telangana.gov.in) ద్వారా తెలుపవచ్చని సూచించారు. పోస్ట్ ద్వారా కాడా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు పంపవచ్చని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో మెదక్ కలెక్టర్ రా హుల్రాజ్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో యాదయ్య, కమిషనర్లు, సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్, రా మ్మూర్తి, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.