సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 1: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఆదివారం డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా, సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు.
ప్రస్తుత సమయంలో ఎవరూ సెలవులో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తంగా విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. లోలెవల్ వంతెనలు, కాజ్‌వేలపై నుంచి నీరు ప్రవహిస్తున్న మార్గాల ద్వారా వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఇతర ప్రాంతాల మీదుగా వెళ్లేలా సూచించాలన్నారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతతో కూడి న జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 1: భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు జరుగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. చెరువులు, కుంటల వద్దకు ప్రజలను వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతా ల్లో ప్రమాద సూచికలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కంట్రోల్ రూమ్ నెంబరు 08455-276155కు ఫిర్యాధులు అందించాలని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కాల్‌కు సత్వరమే అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ఆయా శాఖల అధికారులు, వారు పనిచేస్తున్న స్థలాల్లోనే ఉండాలని, విద్యు త్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంజీర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లు, కార్యాలయాలను వెంటనే ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ రూపేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్1: సిద్దిపేట జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. చెరువులు, కుంటలు, వాగుల్లో వరద పారుతున్నది. జిల్లాలో అత్యధికంగా మిరుదొడ్డి మండలంలో 152.3మి.మీటర్లు, అత్యల్పంగా హుస్నాబాద్ మండలంలో 0.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సరాసరి 82.3శాతం వర్షపాతం నమోదైంది.
దుబ్బాక 88.8మి.మీటర్లు, సిద్దిపేట రూరల్ 139.3మి.మీ, చిన్నకోడూరు81.8మి.మీ, బెజ్జం కి10.3 మి.మీ, కోహెడ93.3మి.మీ, హుస్నాబాద్0.8మి.మీ, అక్కన్నపేట 103.8మి.మీ, నంగునూరు94.3మి.మీ, సిద్దిపేట అర్బన్87.5మి.మీ, తొగుట 98.8మి.మీ, మిరుదొడ్డి152.3మి.మీ, దౌల్తాబాద్ 67.0మి.మీ, రాయపోల్33.4మి.మీ, వర్గల్ 56.3మి.మీ, ములుగు39.8 మి.మీ, మర్కూక్ 94.5మి.మీ, జగదేవ్‌పూర్86.8మి.మీ, గజ్వేల్82.5 మి.మీ, కొండపాక116.5మి.మీ, కొమురవెళ్లి 88.8 మి.మీ, చేర్యాల్54.0మి.మీ, మద్దూర్104. మి.మీ, నారాయణరావుపేట138.5మి.మీ, దూల్మిట్ట 111.0 మి.మీ, అక్బర్పేట- బూంపల్లి15.5మి.మీ, కుకునూర్‌పల్లి99.8 మి.మీ వర్షం కురిసింది.లోతట్టు ప్రాంతా లు జలమయం అయ్యాయి.