అమీన్పూర్(జిన్నారం), జనవరి 23 : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని 993 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు.తహసీల్దార్ వెంకటేశ్ ఆదేశాల మేరకు రెవె న్యూ సిబ్బంది శుక్రవారం రెండు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు.
అక్ర మ నిర్మాణాలు చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించమని తహసీల్దార్ వెంకటేశ్ తెలిపారు.