సిద్దిపేట, నవంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దీక్షా దివస్‌కు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధమైంది. దీక్షా దివస్ విజయవంతానికి ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నేడు సిద్దిపేటలో జరిగే దీక్షా దీవస్ కార్యక్రమంలో మాజీ మంత్రి, తన్నీరు హరీశ్‌రావు పాల్గొంటారు. మెదక్‌లో జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొననున్నారు.
దీక్షా దీవస్‌ను పురస్కరించుకొని శనివారం (నేడు) ఉదయం 10 గంటలకు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.తొలుత సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి, అక్కడి నుంచి బయలుదేరుతారు.అకడి నుంచి కోటిలింగాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పించి, ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహనికి పూల మాల వేసి పాత బస్టాండ్ మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్ద పైలాన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉద్యమ ఫొటో గ్యాలరీని హరీశ్‌రావు, పార్టీ శ్రేణులు తిలకిస్తారు. అనంతరం అమరుల కుటుంబాలను సన్మానించి దీక్షాదీవస్ సభను నిర్వహిస్తారు. ‘ఉద్యమంలో నేను సైతం’ అనే కాన్సెప్ట్‌తో ఉద్యమ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో డిసెంబర్ 9 వరకు రోజు ఒకటి పోస్ట్ చేయాలని తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.