Medak Rains | నిజాంపేట, ఆగస్టు 28 : రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాల ధాటికి వాంగులు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో ఆయా మార్గాల్లో జనజీవనం స్తంభించిపోవడమే కాదు.. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
కాగా నిజాంపేట మండల వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువుల, కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట-మెదక్ NH 765 డీజీ ప్రధాన రోడ్డుపై నందిగామ గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వరదల ధాటికి ధ్వంసమైంది. ఈ బ్రిడ్జిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వేరువేరుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు ఉండద్దని, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్దకు, కుంటల వద్దకు వెళ్లవద్దని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నాయకులు, ఆయా పార్టీల నేతలు ఉన్నారు.
మెదక్ జిల్లాలో దంచికొడుతున్న వర్షాలతో మంజీరా నదికి భారీగా వరదలు పోటెత్తాయి. మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకుందని తెలిసిందే.
Cybercrime | సైబర్ వలలో ఆలయ ఉద్యోగి.. లక్షల్లో మోసపోయిన బాధితుడు
Clay Ganesh | కండ్లకు గంతలు కట్టుకొని.. కేవలం 54 నిమిషాల్లో గణనాథుని విగ్రహం తయారీ
Kamareddy Rains | రెస్క్యూ టీంను పంపించండి సార్.. కామారెడ్డి కాలనీల్లో వరద ముంపు బాధితుల ఆర్తనాదాలు
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త