సిర్గాపూర్, సెప్టెంబర్ 5: పేదలకు విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్‌రాజనర్సింహ అన్నాన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో పీహెచ్సీ నూతన భవన సముదాయాన్ని మంత్రి జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పూజలు చేసి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం భవనాన్ని సందర్శించి ఆయా గదులను సబ్ కలెక్టర్ ఉమాహారతి, వైద్యాధికారి డా. ప్రతిభ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుం టున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 5: వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నారాయణఖేడ్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో రూ.3.90 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు పనులకు శంకుస్థాపన, కన్వెన్షన్‌హాల్ విస్తరణలో భాగంగా రూ.1.15 కోట్లతో నిర్మించనున్న భోజనశాల, రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సబ్ కలెక్టర్ ఉమాహారతి ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.