రామాయంపేట, సెప్టెంబర్ 21: నిజాంపేట మండలం నార్లాపూర్‌లో శనివారం తెల్లవారుజామున విజయ డెయిరీ పాల వ్యాన్ గ్రామానికి చేరుకోగా పాడి రైతులు నిలిపేశారు. పాల డబ్బులు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి వ్యాన్‌ను కదలనివ్వమని మొండికేశారు. వ్యాన్ వెంట వచ్చిన నిర్వాహకుడిని రైతులు నిలదీశారు. రెండు నెలల 15రోజులు గడుస్తు న్నా డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత విజయ పాల డెయిరీ మేనేజర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. రెండు రోజుల్లో డబ్బులు రాకుంటే రామాయంపేట పాలశీతలీకరణ కేంద్రం వద్ద నిరసన తెలుపుతామని డిమాండ్ చేశారు.
కొమురవెల్లి, సెప్టెంబర్ 21 : నాలుగు నెలల నుంచి పాల బిల్లులు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో 15 రోజులకు ఒకసారి బిల్లులు ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజయడెయిరీని మూతపడేలా చేస్తుంది.
–బుడిగె యాదగిరి, పాడిరైతు, గురువన్నపేట, సిద్దిపేట జిల్లా
సరైన సమయంలో పాల బిల్లులు రాక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిం ది. జూలై నుంచి పాల బిల్లులు రావడంలేదు.రోజుకు 15లీటర్ల వరకు పాలను విజయ డెయిరీకి పోస్తా. ఇంత కష్టపడ్డా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తుంది. బర్రెల మేతకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుంది.ప్రభుత్వం వెంటనే రెండు నెలల పాల బిల్లులను మంజూరు చేయాలి.గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాల ధరను పెంచడమే గాకుండా సమయానికి ఇబ్బందులు లేకుండా బిల్లులు అందించింది.
– జెల్ల అంజాగౌడ్, పాడి రైతు, రాంపూర్ రామాయంపేట, మెదక్ జిల్లా
పదేండ్ల నుంచి రోజూ 25 టీటర్ల వర కు విజయ పాల డెయిరీకి పాలు పోస్తా. ఈ మధ్య కొత్త ప్రభుత్వం రావడంతోనే పాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పాల ధరను కేసీఆర్ ప్రభుత్వం పెంచింది. సమయానికి పాల బట్వాడాను కూడా అందజేసిం ది. ఇప్పుడు రెండు నెలల 15రోజులు గడుస్తున్నా పాల పైసలు రావడం లేదు. పశువులకు దాణా తెద్దామన్నా పాల పైసలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే పాడి రైతులకు డబ్బులు చెల్లించాలి లేకుంటే రామాయంపేటలోని విజయ పాలశీతలీకరణ కేంద్రం వద్ద నిరసన తెలుపుతాం.
– ఆకుల మల్లేశం చల్మెడ రామాయంపేట, మెదక్ జిల్లా