 
                                                            సిద్దిపేట, అక్టోబర్ 30: ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.

సిద్దిపేట జిల్లాలో బుధవారం 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్‌లో 30.4 సెంటీమీటర్లు, అత్యల్పంగా దౌల్తాబాద్ లో 1.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

అకన్నపేటలో 28.25 సెంటీమీటర్లు, నంగునూరులో 21.43, మద్దూ రులో 21.05, చిన్నకోడూరులో 20.85, దూల్మిట్టలో 19.88, కోహెడలో 17.95, చేర్యాలలో 17.75, సిద్దిపేట రూరల్‌లో 15.75, నారాయణరావుపేటలో 14.80, బెజ్జంకిలో 12.93, కొమురవెల్లిలో 12.75, కొండపాకలో 11.95, కుకునూరు పల్లిలో 9.45, జగదేవ్‌పూర్‌లో 9.15, ములుగులో 8.0, మరుక్లో 7.63, తోగుటలో 7.30, గజ్వేల్‌లో 6.90, మిరుదొడ్డిలో 4.58, దుబ్బాకలో 4.15, రాయపోల్‌లో 3.75, అక్బర్పేట భూంపల్లిలో 2.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


 
                            