సంగారెడ్డి, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): వర్షాలతో సంగారెడ్డి జిల్లా తడిసిముద్ధవుతున్నది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా జలాలు వచ్చి చేరుతున్నా యి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తుంది.
ఆదివారం ప్రాజెక్టులోకి 8695 క్యూసెక్కులా జలాలు రాగా దిగువకు 112 87 క్యూసెక్కులను రెండు గేట్ల ద్వారా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.9 17 టీఎంసీలుకాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 28.638 టీఎంసీల జలాలు ఉన్నాయి. నల్లవాగు అలుగు పా రుతుండగా నారింజ ప్రాజెక్టు నుంచి దిగువకు జలప్రవాహం కొనసాగుతున్నది.
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పంటనష్టం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 130 గ్రామాల్లో పంటలకు నష్టం జరిగింది. మొత్తం 2900 మంది రైతులకు చెందిన 5078 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలతో చేతికి వచ్చిన పెసర, మినుము పంటలు దెబ్బతిన్నాయి. వరి 84 ఎకరాలు, సోయాబీన్ 1267, మినుములు 1081 ఎకరాలు, పెసర 158 ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
కందులు 1051 ఎకరాలు, పత్తి 1324 ఎకరాలు, చెరుకు ఏడు ఎకరాలు, కూరగాయలు 106 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో అత్యధికంగా 2500 ఎకరాలు, న్యాల్కల్లో 1000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మనూరులో 292 ఎకరాలు, మొగుడంపల్లిలో 284 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో ఇంకా పంటలు నీటమునిగాయి. వ్యవసాయశాఖ అధికారులు ఇంకా పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. దీంతో జిల్లాలో పంటనష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండటంతో పరిశ్రమల నిర్వాహకులు కాలుష్యం వ్యర్థజలాలను వర్షపునీటిలోకి, చెరువులు, కుంటల్లోకి అక్రమంగా వదులుతున్నారు. దీంతో కాలుష్య జలాలు చెరువుల అలుగుల ద్వారా గ్రామాల్లోని రోడ్లమీద ప్రవహిస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గం పాశమైలారం పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలు కాలుష్య వ్యర్థ జలాలను అక్రమంగా వరదకాల్వల్లోకి వదులుతున్నాయి. రుద్రారంలోని ఓ పరిశ్రమ వ్యర్థజలాలు వదలడంతో జాతీయ రహదారి పక్కన ఉన్న కాల్వ, రహదారిపై నురుగులుగా ప్రవహి స్తున్నాయి.