చిలిపిచెడ్, జనవరి 10: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో మొసళ్లు సంచరిస్తుండడంతో నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, మేకలకాపరులు, రైతులు భయాందోళనకు గురువుతున్నారు. శుక్రవారం చిలిపిచెడ్ శివారు మంజీరా నదిలో బర్రెలు, గొర్రెలకాపరులకు మొసళ్లు కనిపించడంతో ఒడ్డుకు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న రైతులు, మత్స్యకారులు అక్కడకి చేరుకున్నారు. మొసలి కొద్దిసేపటికి నీటిలోనికి చేరడంతో అక్కడి నుంచి వారు ఇంటికి ప్రయాణమయ్యారు. కొత్తమంది సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మొసళ్ల సంచారంతో నదీతీర ప్రజ లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.