SP UdhayKumar Reddy | మెదక్ అర్బన్, ఏప్రిల్ 12 : డ్రగ్స్ వల్ల సమాజంలో యువ శక్తి విచ్చిన్నం అవుతుందని జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలలో భాగంగా అవగాహన పోస్టర్‌ను ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని అన్నారు.
పోలీస్ శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం పని చేస్తుందని.. పౌరులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత, విద్యార్థులు దేశ సంపద. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది. కావున విద్యార్థుల్లో, యువతలో మార్పురావాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుందని మంచి భవిష్యత్తును కోల్పోతారని పేర్కొన్నారు.
డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో చెడ్డపేడు వస్తుందని.. గంజాయి కొకైన్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!