నర్సాపూర్, జూలై 29: కొండపోచమ్మ సాగ ర్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం సరైన ధర నిర్ణయించి పరిహారం అందించి న్యాయం చేయాలని లోక్సత్తా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తాలో భూనిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సోమవారం వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
ఆర్డీవో రైతువేదికలో రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవార్డు పథకం కింద రైతుల కోరికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడని,కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రాజకీయ నాయకులు రైతుల దీక్ష గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైన అధికారులు స్పదించి రైతుల కు న్యాయం చేయాలన్నారు. రైతులకు సరై న ధర ఇవ్వాలి లేదా కాలువను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సీపీఎం నా యకుడు నాగరాజు, రైతులు పాల్గొన్నారు.