ప్రలోభాలకు గురికావద్దు
జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 16 నుంచి 26 వరకు ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు.
- ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
- జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా
- పాపన్నపేట మండలం మల్లంపేటలోని పోలింగ్ బూత్‌ల పరిశీల
నపరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14 : జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 16 నుంచి 26 వరకు ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు.
కేంద్రాల నుం చి 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడవద్దన్నారు. పరీక్షల సమయంలో పోలీసు అధికారులు పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. పరీక్షా సమయానికి గంట ముందు చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. గవర్నమెంట్ హైస్కూల్ పారుపల్లి స్ట్రీట్ (ఎస్ఎస్సీ), గవర్నమెంట్ హైస్కూల్ మెదక్ రోడ్ సిద్దిపేట (ఇంటర్మీడియెట్ పరీక్షలకు) కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
– మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా

పాపన్నపేట, అక్టోబర్ 14: ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా సూచించారు. శనివారం మండలంలోని మల్లంపేటలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఎన్నికల విధులు విస్మరించిన మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన ఎన్నికల సూపర్వైజర్ రాధాకృష్ణను సస్పెండ్ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన పోలింగ్ బూత్‌ల వద్ద మౌలిక సదుపాయాలు, ఓటరు జాబితాలను పరిశీలించారు. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేయాలన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించడంతో అధికారి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంట స్థానిక తహసీల్ధార్ లక్ష్మణ్ బాబు, పీఆర్‌ఈఈ నర్సింలు,స్థానిక సర్పంచ్ బాపురెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

