సంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): తెల్లబంగారం తెల్లబోతున్నది. అధిక వర్షాలు, తెగుళ్లు పత్తి రైతులను నష్టాల బాటపట్టిస్తున్నాయి. వర్షాలతో ఓవైపు పంటనష్టం జరగగా, తెగుళ్ల కారణంగా పంటలు ఎండిపోయి పత్తి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తెగుళ్లు, అధిక వర్షాలతో పంట దిగుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతున్నది. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో పత్తి సాగుచేస్తే 12 క్విం టాళ్లు అంతకు పైన దిగుబడి వస్తుంది. ప్రస్తు తం జిల్లాలో అంత దిగుబడి వచ్చేలా కనిపించడం లేదు. పంట దిగుబడి తగ్గడంతో రైతు ల్లో ఆందోళన కనిపిస్తున్నది.
పంటదిగుబడి తగ్గినా మద్దతు ధర పెరుగుతుందని పత్తి రైతు లు ఆశపడ్డారు. కేంద్ర సర్కారు ఆశించిన స్థాయిలో పత్తి మద్దతు ధర ప్రకటించలేదు. క్వింటాల్ పత్తికి రూ.7521 మద్దతు ధర ప్రకటించడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. దీనికి తోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. సీసీఐ పతి ్తకొనుగోలు చేయలేని పక్షంలో ధర విషయంలో రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఏటా పత్తి సాగుచేస్తారు. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం 4 లక్షలు చేరుకుంటుందని అంచనా వేశారు. వానకా లం ఆరంభంలో ఆశించిన వర్షాలు కురవక పోవడంతో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో రైతు లు పత్తి సాగుచేశారు. గతేడాది కం టే ఈసారి విస్తీర్ణం తగ్గింది. పత్తిపంట బాగా ఎదిగే దశ లో గత నెలలో భారీ వర్షాలు, వరదలతో పం టకు భారీ నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లా లో 7వేల ఎకరాల వరకు పత్తి పంటకు నష్టం వాటిల్లింది.పత్తి ఎక్కువగా సాగుచేసే మునిపల్లి, సదాశివపేట, రాయికోడ్, న్యాల్కల్, సంగారెడ్డి, వట్పల్లి, జహీరాబాద్, చౌటకూ రు, నారాయణఖేడ్, పుల్కల్, వట్పల్లి మండలాల్లో పత్తి పంట ఎక్కువగా దెబ్బతిన్నది. అధికారులు మాత్రం 3367 ఎకరాల్లో మా త్రమే పత్తి పంటకు నష్టం వాటిళ్లిందని, ఇం దులో 1290 ఎకరాల్లో మాత్రమే 33శాతానికి పైగా పంటనష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
పంటనష్ట పరిహారం పై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు పంట నష్టాన్ని తక్కువగా చూపి ప్రభుత్వానికి నివేదిక పం పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు తెగుళ్లు సోకి మరింత నష్టం జరిగిం ది. ఎండుతెగులు కారణంగా పత్తి చెట్టు, కాయలు ఎర్రగా మారి ఎండిపోయి దిగుబడి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో 10 నుంచి 12 క్విం టాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ఈ సీజన్లో 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్ర మే వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పంటనష్టం జరగడం, దిగుబడి తగ్గ టం, మద్దతు ధర తక్కువగా ఉం డడం పత్తి రైతులకు శరాఘాతంగా మారింది. పెట్టుబడుల డబ్బులు సైతం వచ్చే అవకాశాలు లేవని రైతులు వాపోతున్నారు.