నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఉమ్మడి మెదక్ జిల్లా, డిసెంబర్ 29 : పథకమేదైనా పక్కాగా అమలు జరగాలి.. లక్షిత వర్గాలకు ఆ ఫలాలు చేరాలి, ఇదే ప్రాధాన్యంగా తన కలాన్ని ఎక్కుపెట్టింది ‘నమస్తే తెలంగాణ’. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలు, నేరాలను ఓ కంట కనిపెడుతూ, అక్రమార్కులు, నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా అనేక వార్తలు , కథనాలను ప్రచురించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడాది కాలంలో జరిగిన అనేక అక్రమాలు, అవినీతిని కథనాల రూపంలో వెలుగులోకి తెచ్చి ప్రజల ముందుంచింది. అక్రమార్కుల అంతుచూసింది. భూ కబ్జాలు, భూముల అన్యాక్రాంతం, స్కామ్‌లు, లంచాలు.. ఒక్కటేమిటీ చట్టవ్యతిరేకంగా జరిగే పనులు, అసాంఘిక కార్యకలాపాలు, నేరాలపై ఫోకస్ చేస్తూ అక్రమార్కులు, నేరగాళ్లను హడలెత్తించింది.