దుబ్బాక,జూలై 4: సమైక్య పాలనలో ..సర్కారు దవాఖానలంటే నరకకూపాలుగా ఉండేవి. దీంతో సర్కారు దవాఖాన అంటేనే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు భయపడేవారు. సమైక్యపాలనలో అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు సర్కారు వైద్యం లభించేది. పాలకుల నిర్లక్ష్యం..నిధుల కొరతతో.. ఆనాడు ప్రభుత్వ వైద్యశాలలు దుర్భర పరిస్థితుల్లో మగ్గేవి. దుబ్బాకలో సామాజిక ఆరోగ్యకేంద్రం సమైక్యపాలనలో సరైన వసతులు, నామమాత్రపు వైద్యసిబ్బందితో పాత భవనంలో తూతూమంత్రంగా వైద్య సేవలందించేవారు. దవాఖానకి వైద్యం కోసం వచ్చిన వారికి కనీసం మంచాలు లేని దుస్థితి ఆనాటిది. దవాఖానలో వైద్యులు సైతం అందుబాటులో లేకపోవటంతో స్టాఫ్‌నర్సులు, సిబ్బంది వైద్యం అందించేవారు.
నేడు


కార్పొరేట్ తరహాలో వందపడకల దవాఖాన
దుబ్బాకలో కార్పొరేట్ దవాఖాన తరహాలో వందపడకల దవాఖాన భవనాన్ని నిర్మించారు. నాలుగు ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో ఆధునాతనహంగులతో విశాలమైన 20 గదులను నిర్మించారు. దవాఖానకి వచ్చే రోగులకు సకలవసతులతో కూడిన సర్కారు వైద్యం అందిస్తున్నారు. రోగులతోపాటు వచ్చే వారికి ఇబ్బందులు లేకుం డా భోజనం, మంచాలు అన్ని వసతులున్నాయి. ప్రసూతి వైద్యసేవలతోపాటు అన్ని రకల శస్త్ర చికిత్సలు, డయాలసిస్ వైద్యసేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దవాఖానలో రూ.కోటి విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా దుబ్బాక సర్కారు దవాఖానలో సకల వసతులు, మెరుగైన వైద్యసేవలందుతున్నాయి.
నాడు
