మెదక్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సాధారణ ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పా ట్లు సిద్ధం చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి హవేళీఘనపూర్లోని వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు చేయాల ని, అందులో భాగంగా ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాల ప్రకారం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈవీ యం, వీవీప్యాట్, యంత్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్ నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మెదక్ జిల్లా ఓటర్ల చైతన్యం కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా స్వీప్ సాంగ్ ‘కచ్చితంగా ఓటేద్దాం’ పాటను బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆవిషరించారు. ఆర్డీవోలు అంబాదాస్ రాజేశ్వర్, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, తహసీల్దార్లు శ్రీనివాస్, కమలాద్రి, శ్రీనివాస్ చారి, లక్ష్మణ్, ఏవో బలరాం పాల్గొన్నారు.