రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సంగారెడ్డి, మెదక్ జిల్లాలు భగ్గుమన్నాయి. రైతులకు 3గంటల విద్యుత్ చాలని టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఊరూరా రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసనలు పెల్లుబికాయి. రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. మళ్లీ రైతులను చీకటిపాలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చాకే వ్యవసాయం పండుగలా మారిందని, ఇది చూసి ఓర్వలేని హస్తం పార్టీ నేతలు విషం కక్కుతున్నారని విరుచుకుపడ్డారు. కర్షకుల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని, భవిష్యత్తులో ఆ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగన్విమని రైతులోకం పేర్కొంది. బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతాప్రభాకర్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలతో సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున్నదని మండిపడ్డారు.
– మెదక్ న్యూస్ నెట్వర్క్, జూలై 12
రైతుల జోలికొస్తే పుట్టగతులుండవ్.. సొంతరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవడాన్ని చూసి ఓర్వలేకనే ఉచిత కరంట్పై రేవంత్‌రెడ్డి అనుచితంగా మాట్లాడుతున్నారు. రైతుల జోలికొస్తే పుట్టగతులుండవ్. రేవంత్‌రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైతుల బాధలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. రేవంత్‌రెడ్డి రైతుబిడ్డనని చెప్పుకోవడం కాదు పొలందున్ని పంట పండిస్తే తెలుస్తది రైతుల బాధలు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రైతులు చూస్తూ ఊరుకోరు. సీఎం కేసీఆర్ ప్రతి పంటకూ పెట్టుబడి సాయం అందిస్తుండు. రైతులకు బీమా ఇస్తుండు. ఉచితంగా 24 గంటలు కరంట్ ఇస్తుండు. ఇది తట్టుకోలేక ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం తగదు.
– సత్తయ్య, రైతు, నల్లవల్లి గ్రామం, గుమ్మడిదల మండలం
ఊరూవాడా మిన్నంటిన నిరసనలు
మెదక్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు మెదక్ జిల్లాలో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. రైతులకు ద్రోహం చేసేందుకు 24 గంటల ఉచిత కరెంటు రద్దు చేస్తామని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రాందాస్ చౌర స్తా వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, చిలిపిచేడ్, కొల్చారం, చిన్నశంకరంపేట, హవేళీఘనపూర్, నిజాంపేట, తూ ప్రాన్, వెల్దుర్తి, నర్సాపూర్, శివ్వంపేట తదితర మండలాల్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. రైతు బాగుంటే చూడలేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్, జూలై 12: తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను మనోహరాబాద్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులతో కలిసి బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, జూలై 12: ఎకరం పొలం పారడానికి గంట సమయం పడుతుంది, రైతాంగానికి మూడు గంటల కరెంట్ ఇస్తే చాలు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి వాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని, రేవంత్‌రెడ్డి మాటలు ఆనాటి చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదన్నారు.
ట్రాన్స్‌ఫార్లర్లు కాలిపోయి, పంటలు ఎండిపోయి, రైతులు ఆత్మహత్యలు, ప్రమాదాల బారిన పడి మృతిచెందారన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్కార్ 24 గంటలు మెరుగైన విద్యుత్ అందించి ఆదుకోవడంతో సమృద్ధిగా పంటలు పండి రైతులు సంతోషంగా జీవిస్తుంటే కాంగ్రెస్ కుటిలబుద్ధితో రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపా నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, తోట నర్సిం లు, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఖాజా, శేఖాగౌడ్, నర్సింలు, గంగాధర్, శాఖారంశ్రీను, పాండురంగంల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేకి..
పటాన్చెరు, జూలై 12: కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం దండుగ, 3 గంటల ఇస్తే సరిపోతదని బాధ్యతారాహిత్యంగా వాఖ్యానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను కాల్చి బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. పార్టీ మండల అధ్యక్షుడు బీ.పాండు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై ఊరేగిస్తూ తెచ్చి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటలు అవసరం లేదని, 3 గంటల ఇస్తే సరిపోతుందని రేవంత్‌రెడ్డి చెప్పడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర విద్యుత్ కోతలు చూశారన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని కొనియాడారు.
24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం దేశంలో తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. బీఆర్ఎస్ పాలనను మెచ్చి మూడోసారి అధికారం ఇవ్వడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పా నగేశ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, సర్పంచ్‌లు ఉపేందర్ ముదిరాజ్, సుధీర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, ఎంపీటీసీ మన్నెరాజు, నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, మాజీ సర్పంచ్ బీ.వెంకట్‌రెడ్డి, మెరాజ్‌ఖాన్, అక్రమ్‌పాషా, యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, ముత్తంగి గ్రామ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ ముదిరాజ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.