సిద్దిపేట, మే 27: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి సిద్దిపేట నియోజకవర్గ పద్మశాలీలకు రూ.5లక్షల విలువ కలిగిన 50 కుట్టు మిషన్లను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశాలీలు ఆర్థికంగా బలోపే తం కావాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలీలు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. జకత్ మగ్గాలు, సిద్దిపేట గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చామన్నారు. నేత కార్మికులకు చేతినిండాపని కల్పించి ఆదుకున్నామన్నారు. పాలనపై కాంగ్రెస్ పట్ల ప్రజ లు విసిగిపోయారన్నారు. మహిళలు కుట్టు మిషన్ ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం పొంది పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కార్యక్రమంలో మా జీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు పాల సాయిరామ్, గుండు భూపేశ్, బూర విజయమల్లేశం,అడ్డగట్ల శేఖర్, పద్మశాలీ సమాజం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీశ్, ముదిగొండ శ్రీనివాస్, సంగు పురేందర్, విఠల్ పాల్గొన్నారు.