కొండపాక(కుకునూర్‌పల్లి), జనవరి 25: రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పీటీ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దెబ్బెట భాస్కర్, వార్డు సభ్యులు వెంకటచారి, పెరిక కిషన్, కడవేర్గు బాల్‌రాజు, శ్రీకాంత్, బుర్రిరాములు, బుర్రి రమేశ్ గజ్వేల్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కండువాలు కప్పి హరీశ్‌రావు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
కేసీఆర్ పాలనలో జీపీలకు ట్రాక్టర్ ఇవ్వడంతో ఇంటింటికీ చెత్త సేకరణతో గ్రామా లు శుభ్రంగా మారాయన్నారు. డంపింగ్ యార్డు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టినట్లు హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర మాజీ కో ఆర్డినేటర్ దేవీ రవీందర్, సీనియర్ నాయకలు లక్ష్మణారాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కిష్టయ్య, మాజీ సర్పంచ్ స్వామి, మాజీ ఉప సర్పంచ్ వెంకట్‌గౌడ్, కిషన్, కుమ్మరి రాజు, దార గణేశ్, దార కనకయ్య పాల్గొన్నారు.