సంగారెడ్డి, ఆగస్టు 27 : రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన 60మంది యువకులు భారీ బైక్‌ర్యాలీతో క్యాంపు కార్యాలయానికి చేరుకుని బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరేందుకు తరలివచ్చిన యువతను ఘనంగా పార్టీలోని ఆహ్వానిస్తూ కండువాలు వేసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ ప్రకటించడంతో యువకులు హర్షం వ్యక్తం చేశారు.
యువకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో చింతా ప్రభాకర్‌ను ఆఖండ మెజార్టీతో గెలిపించేందుకు పనిచేస్తామని ప్రకటించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తున్న వ్యక్తి ప్రభాకర్ అని గుర్తుచేశారు. రాను న్న ఎన్నికల్లో యువత పూర్తి సహకారం ప్రభాకర్‌కే ఉంటుందని ధీమావ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో విశాల్, నర్సింహులు, రాహుల్, రామకృష్ణ, వికాస్, రోహిత్‌తో పటు 60మంది యువకులు ఉన్నారు. కార్యక్రమంలో మల్లేశం, సామెల్, వెంకటేశం, ఈశ్వర్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.