నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీలోని ఆరవ, ఏడవ వార్డులోనీ ఖాజిగల్లీలో గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అజ్మత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలియాస్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6,7 వార్డులలో మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులలో ఉన్న రెండు బోర్లు చెడిపోయి ఉండగా వాటికి మరమ్మతులు చేయించడం లేదని వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించి కాలనీవాసులకు ఉపశమనం కలిగించాలని వారు కోరారు.