చేర్యాల, మే11: మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన మహిళా ఉపాధ్యక్షురాలు, మాజీ వార్డు సభ్యురాలు వల్లూరి కవితతో పాటు పలువురు నాయకులు, మహిళలు కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తమకు మాయమాటలు చెప్పి రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేర్పించుకున్నట్లు తెలిపారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్లోనే కొనసాగుతామని, ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం శాయశక్తుల కృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అరిగె కనకయ్య, ఎంపీటీసీ శివశంకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ పెద్దింటి ప్రసాద్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మిరుదొడ్డి, మే 11: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విధానాలు నచ్చకనే బీజేపీని వీడి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం అల్వాల గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ నాయకులు వైస్ ఎంపీపీ పోలీసు రాజులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), మే 11: కొండపాక మండలంలోని ఖమ్మంపల్లికి చెందిన బీఎస్పీ కొండపాక మండలాధ్యక్షుడు అందే భూపాల్ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఎస్పీ మండలాధ్యక్షుడు భూపాల్‌కు లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.