కంగ్టి, డిసెంబర్ 5 : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స్థానం కోసం పోటీపడుతున్నారు.
కాంగ్రెస్ మద్దతుదారుగా మణిరామ్, బీఆర్ఎస్ మద్దతుదారుగా అతని తమ్ముడి కుమారుడు రాందాస్ నామినేషన్ దాఖలు చేశారు. మణిరామ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా, అతని తమ్ముడు గురుదాస్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నాడు. రాందాస్ ఐఐఐటీలో బీటెక్ చేసి, అనంతరం ఎంటెక్లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. విద్యావంతుడైన రాందాస్ గ్రామాభివృద్ధ్దికి పాటుపడతాడనే ఉద్దేశంతో కుమారుడికి బీఆర్ఎస్ నుంచి అవకాశం కల్పించినట్లు తండ్రి గురుదాస్ తెలిపారు.