సంగారెడ్డి జనవరి 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో రేవంత్సర్కా ర్ పూర్తిగా విఫలమైందన్నారు. బుధవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతలను అదుపుచేయడంతోపాటు గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు చెప్పారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో సంగారెడ్డి జిల్లా గంజాయి సాగు, రవాణాకు అడ్డాగా మారిందన్నారు. మహిళలపై లైంగికదాడులు, దోపిడీలు, దొంగతనాలు, సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయన్నారు. జిల్లాలో నేరాల సంఖ్య ఏడాదిలోనే ఎందుకు పెరుగుతున్నదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకువచ్చి బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతుండటం వల్ల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు. జిల్లాలో నిఘా విభాగం, స్పెషల్ బ్రాం చి పోలీసులు పనిచేయడంలేదా అని ప్రశ్నించారు. నేరాల అదుపునకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసుశాఖ ఎందుకు విఫలమవుతుందన్నారు. 2023లో సంగారెడ్డి జిల్లాలో 6429 కేసు లు నమోదైతే కాంగ్రెస్ ఏడాది పాలనలో 7563 కేసులు నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో మహిళలపై లైంగికదాడులు 31శాతం పెరిగినట్లు తెలిపా రు. 2023లో లైంగికదాడుల కేసులు 100 న మోదైతే 2024లో 131 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2023లో దొంగతనం కేసులు 420 నమోదు కాగా ఈ ఏడాది 639 కేసులు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో దోపిడీలు 112 శాతం పెరిగాయని, 2023లో 15 దోపిడీ కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది 36 కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఈ లెక్కలన్నీ సొంతంగా చెప్పడం లేదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ విడుదల చేసిన వార్షిక నివేదిక ఆధారంగా చెబుతున్నట్లు చెప్పారు. 2023లో గంజాయికి సంబంధించి 11 కేసులు ఉండగా 2024లో 34 కేసులు నమోదైనట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్ కేసులు 400 శాతం పెరిగినట్లు తెలిపారు. 2023లో 323 సైబర్ క్రైమ్ కేసులు ఉంటే 2024లో 796 కేసులు నమోదైనట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో సైబర్ క్రైమ్ కేసులను అరికట్టేందుకు ప్రత్యేకంగా సైబర్ కంట్రోల్ వింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు దెబ్బతిని ప్రజల ధన, ప్రాణాలకు రక్షణ లేకుండా పో యిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో భరోసా ఉండేదన్నారు.
షీటమ్స్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించిందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం, పోలీసుశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. విలేకరుల సమావేశంలోఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, జడ్పీమాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, మఠం భిక్షపతి, శివరాజ్‌పాటిల్, తదితర నాయకులు పాల్గొన్నారు.