నర్సాపూర్, డిసెంబర్ 26: మొన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నర్సాపూర్‌లోని సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు… ఏ సమయంలో ఇస్తున్నారని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఉదయం 4.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇస్తున్నట్లు రికార్డులో ఉంది.
దీన్ని బట్టి 12 నుంచి 13 గంటలే కరెంట్ ఇస్తున్నారు. మీ రేవంత్‌రెడ్డి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. అని బయట మాట్లాడుతున్నాడని గట్టిగా ప్రశ్నించారు. హరీశ్‌రావు పర్యటన ఎఫెక్ట్‌తో నిన్నటి నుంచి ప్రభుత్వం దిగొచ్చింది. రైతులకు ఉదయం 3.30 గంటలకే విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షం ప్రశ్నిస్తే కానీ… కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడటం లేదు అనడానికి, రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనం.