నర్సాపూర్, జూన్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడత 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. 2855 వివిధ దశల్లో ఉన్నాయి. 349 మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో ఇంకా ప్రారంభం కానివి 721 ఉండగా, 678 వరకు స్లాబ్ వేసినవి ఉన్నాయి. మార్కింగ్ వేసినవి 423 ఉన్నాయి. బేస్మెంట్ లేవల్లో 408 ఉండగా, 201 వరకు గోడలు లేచాయి. ఇందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.36.53 కోట్లు మంజూరు చేసింది. కార్లు, ట్రాక్టర్లు ఉన్నాయనే సాకుతో కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయలేదు. ఇండ్లు నిర్మించుకోవడానికి మొదట సుమారు లక్ష వరకు ఖర్చు అవుతుందని, వాటిని ఖర్చుచేసే స్తోమతలేని వారు ఇండ్లు మంజూరైనా నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కొల్చారం మండలంలో మొత్తం 368 మంజూరుకాగా, 58 బేస్మెంట్ లెవల్లో, 30 గోడల లెవల్లో, 69 స్లాబ్ దశలో, మొదలు కానివి 69, మార్కింగ్ వేసినవి 58, పూర్తయినవి 29 ఉన్నాయి. నర్సాపూర్ మండలంలో మొత్తం 325 మంజూరుకాగా 37 బేస్మెంట్ లెవల్లో, 27 గోడల లెవల్లో, 77 స్లాబ్ దశలో, మొదలు కానివి 55, మార్కింగ్ వేసినవి 50, పూర్తయినవి 63 ఉన్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 375 మంజూరుకాగా 77 బేస్మెంట్ లెవల్లో, 13 గోడల లెవల్లో, 64 స్లాబ్ దశలో, మొదలు కానివి 136, మార్కింగ్ వేసినవి 56, పూర్తయినవి 56 ఉన్నాయి. శివ్వంపేట మండలంలో మొత్తం 498 మంజూరుకాగా 61 బేస్మెంట్ లెవల్లో, 29 గోడల లెవల్లో, 133 స్లాబ్ దశలో, మొదలు కానివి 132, మార్కింగ్ వేసినవి 57, పూర్తయినవి 50 ఉన్నాయి. కౌడిపల్లి మండలంలో మొత్తం 373 మంజూరుకాగా 58 బేస్మెంట్ లెవల్లో, 30 గోడల లెవల్లో, 69 స్లాబ్ దశలో, మొదలు కానివి 69, మార్కింగ్ వేసినవి 58, పూర్తయినవి 29 ఉన్నాయి.
వెల్దుర్తి మండలంలో మొత్తం 417 మంజూరుకాగా 50 బేస్మెంట్ లెవల్లో, 28 గోడల లెవల్లో, 76 స్లాబ్ దశలో, మొదలు కానివి 86, మార్కింగ్ వేసినవి 76, పూర్తయినవి 59 ఉన్నాయి. మాసాయిపేట మండలంలో మొత్తం 237 మంజూరుకాగా, 25 బేస్మెంట్ లెవల్లో, 22 గోడల లెవల్లో, 53 స్లాబ్ దశలో, మొదలు కానివి 92, మార్కింగ్ వేసినవి 14, పూర్తయినవి 31 ఉన్నాయి. చిలిపిచెడ్ మండలంలో మొత్తం 262 మంజూరుకాగా 38 బేస్మెంట్ లెవల్లో, 21 గోడల లెవల్లో, 70 స్లాబ్ దశలో, మొదలు కానివి 62, మార్కింగ్ వేసినవి 50, పూర్తయినవి 21 ఉన్నాయి. ఇండ్ల నిర్మాణం మొదలైనప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఏఈ, డీఈ అప్రువల్ ఇస్తే అనంతరం పీడీ, ఎండీ స్థాయిలు బిల్లులు మంజూరు చేస్తున్నట్లు, ఇందుకోసం ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి వివిధ దశల్లో ఉన్నవారికి 15 నుంచి 20 రోజుల్లో బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.36.56 కోట్లు చెల్లించాం.
– ప్రభు, హౌసింగ్ డీఈ, నర్సాపూర్