నర్సాపూర్, జూన్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, జొన్నలు కొని మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వం జొన్నలు కొని రైతులకు డబ్బులు చెల్లించడం మరిచిందన్నారు. గజ్వేల్ ప్రాంతంలో సన్‌ప్లవర్ రైతులకు ఇదే పరిస్థితి ఎదురైందన్నారు. పంటల బీమా అమలు చేస్తామని బడ్జెట్ మంత్రి భట్టి విక్రమార్క గొప్పులు చెప్పి అమలు మరిచారని హరీశ్‌రావు మండిపడ్డారు.
తక్షణమే వానకాలానికి రూపాయి రైతుల నుంచి తీసుకోకుండా పంటల బీమా అమలుచేయాలని డిమాండ్ చేశారు. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో సైతం ప్రభుత్వం ఫెయిల్ అ య్యిందని మండిపడ్డారు. వనగండ్లతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇప్పటికీ రైతులను ఆదుకోలేదని గుర్తుచేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుబీమా, రైతుబంధు, విత్తనాలు ఆగలేదని గుర్తుచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదన్నారు. మార్చి 31 కల్ల రైతుభరోసా డబ్బుల అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, జూన్ నెల అయిపోతున్నా యాసంగా రైతుభరోసా పడలేదన్నారు. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరాగిపోతుంటే… పిట్టలాగా రైతులు రాలిపోతుంటే…అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ్ద రైతుల మీద ప్రభుత్వానికి లేకపాయే అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రేషన్‌కార్డులు లేవని, ఇందిరమ్మ ఇండ్లు రావని, రాజీవ్ యువవికాసం ఉత్తదని, రైతు బోనస్ లేదన్నారు.
ఇప్పటికే రూ.1100 కోట్ల సన్నాల బోనస్ పెండింగ్‌లో ఉందని, తక్షణమే సన్నవడ్లు పండించిన రైతులకు బకాయిలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు కేసీఆర్ హయాంలో మంజూరైందని, భూసేకరణ పూర్తిచేశామని, కానీ.. కాంగ్రెస్ ప్రభు త్వం భూనిర్వాసితులకు రూపాయి పరిహారం చెల్లించలేదని, 18 నెలల నుంచి ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో అంగుళం పురోగతి లేదని విమర్శించారు. నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, తక్షణమే ఆర్ఆర్ఆర్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, ఆరుగ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. విలేకరుల సమావేశంలె రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ న్ చంద్రాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, నాయకు లు సంతోష్‌రెడ్డి, సత్యంగౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మా జీ జ డ్పీటీసీ బాబ్యానాయక్ నాయకులు పాల్గొన్నారు.