సిద్దిపేట, ఏప్రిల్ 1: బీఆర్ఎస్ హయాంలోనే పద్మశాలీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలను బంద్ చేసిందన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని మారండేయ దేవాలయంలో 50 మంది పేద పద్మశాలి మహిళలకు ఆయన కుట్టుమిషన్లు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడటంలో పద్మశాలి సమాజం ఆదర్శంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వృత్తిమీద ఆధారపడే వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని, పద్మశాలీలకు చేనేత బంధు, త్రిఫ్ట్సిం ద్వారా సహాయం చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పద్మశాలి సంఘం నాయకులు డాక్టర్ సతీశ్, కాముని రాజేశం, బింగి రాజేశం పాల్గొన్నారు.