మునిపల్లి,అక్టోబర్ 16: రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్నచెల్మడ గ్రామాల మాజీ సర్పంచ్‌లు బిందేశ్వరి,విజయ్‌భాస్కర్‌తో పాటు మండలంలోని కాం గ్రెస్,బీజేపీ నాయకులు భారీ ఎత్తున మాజీ మంత్రి సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అసమర్ధ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి అటకెక్కిందని, సంక్షేమం ఆగిందన్నారు. రేవంత్ పాలనలో దోపిడీ సాగుతోందన్నారు.
కాంగ్రెస్ అధికారం ఇచ్చినందుకు రాష్ర్టాన్నే దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధిలో అన్నిరంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మరే అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఆరుగ్యారెంటీలు, అనేక హామీలిచ్చి ప్రజలను మో సం చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో దేశంలో ముందంజలో ఉందని, కేసీఆర్ పాలన చూసి నేడు కాంగ్రెస్,బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు భరోసా అని అన్నారు. బీఆర్ఎస్లో కార్యకర్తలక, నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ వైపే చూస్తున్నారని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తుపెట్టుకోవాలన్నారు.కేసీఆర్ అంటే ప్రజలకు ఓ నమ్మకం.. కాంగ్రెస్ అంటే మోసం అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి కేరాఫ్ అడ్రస్ అని, ప్రజలను నమ్మించి గొంతు కోయడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్ల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని హరశ్రావు అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వం నచ్చ డం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారని, అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం పూర్తి అబద్ధమ ని, హామీలు అటకెక్కాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, హామీలు అమలు చేయడం మరిచి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి అంటేనే కేసీఆర్…కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని ప్రజలకు అర్థం అయిందన్నారు. కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చేప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జైపాల్‌రెడ్డి, సాయికుమార్, మునిపల్లి మాజీ జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
-అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్