చిన్నకోడూరు, జూలై 15 : ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్లోని అనంతగిరి రిజర్వాయర్‌ను బీఆర్ఎస్ నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని, వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నా, రేవంత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు.
గతంలో చంద్రబాబు రైతులను నిర్లక్ష్యం చేసిన విధంగానే, నేడు ఆయన శిష్యుడు సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని విమర్శించారు. వెంటనే కన్నెపల్లి నుంచి ప్రాజెక్టులను నింపి రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం పరుష వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, హింసను ప్రేరేపించేలా మాట్లాడిన సీఎంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని రాధాకృష్ణ శర్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, కాముని ఉమేశ్‌చంద్ర, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కొండం రవీందర్ రెడ్డి, మేడికాయల వెంకటేశం, కీసరి పాప య్య, మోస ర్ల మధుసూదన్ రెడ్డి, కాల్వ ఎల్లం, కిస్టాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి, రేగుల దేవ య్య, నముండ్ల హరీశ్, గడ్డం , బండిపల్లి రాజవ్వ, కామ శ్రీనివాస్, వనాకర్ రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.