నర్సాపూర్, ఏప్రిల్ 5: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గజ్వేల్లో తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదుష్టకరమని అన్నారు. ప్రజల సమస్యలు వినిపించుకునే ప్రదేశాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధ్దమని తెలిపారు. దాడులు, విధ్వంసాలు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శణమని పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని దశాబ్ద కాలంగా సమర్థ్దవంతంగా పరిపాలించిన కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడటం దురదుష్టకరమని ఆమె అన్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ శాంతిభద్రతలను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ సునీతాలక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.