శివ్వంపేట, అక్టోబర్ 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి ఆపార్టీ కార్యకర్తలే విసుగుచెందుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో గొల్ల మల్లేశ్, కొత్తింటి యాదగిరి, అన్నారం మహేశ్, గైనిబైటి అంజాగౌడ్, కన్నారం రమేశ్, ఎర్ర మల్లేశ్, నరేందర్‌గౌడ్ ఉన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, మాజీ సర్పంచ్ దుర్గేశ్, నాగభూషణం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కొల్చారం, అక్టోబర్ 3: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రా మానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు రవితేజరెడ్డి, దొడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారి లో ఆయిలి శ్రీనివాస్, శేఖర్, దుర్గేశ్, బాయి కా భిక్షపతి, భాగయ్య, అంజి, రాజు, వీరే శం, శ్రీకాంత్, శ్రీశైలం, రామకిష్టయ్య ఉన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు గౌరిశంకర్ గుప్తా, బీఆర్ఎస్ మండల నాయకులు ముత్యంగారి మేఘమా ల సంతోష్‌కుమార్, రమేశ్, కాశం శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.