సిద్దిపేట ప్రతినిధి/తొగుట,సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ) :‘ఆనాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు.. కోర్టుల్లో కేసులు వేసిండ్రు..సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవ్వాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’..అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ నీళ్లతోని మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పంటలు పండడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా అని నిలదీశారు. కేసీఆర్ కట్టించిన మల్లన్నసాగర్లో 21 టీఎంసీల నీళ్లు వచ్చాయని తాము పసు పు కుంకుమ వేసి గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని వచ్చామన్నారు. దానిని కూడా అడ్డుకోవడమేనా..? అని ప్రశ్నించారు. ఏది ఏమైనా కేసీఆర్ కల ఫలించిందని, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి తొలిసారిగా 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపిస్తున్నదన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి మల్లన్నసాగర్‌ను హరీశ్‌రావు సందర్శించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే ఈ మల్లన్నసాగర్లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తొలిసారి మల్లన్నసాగర్లో 21 టీఎంసీల నీటిని నింపుకోవ డం చాలా ఆనందంగా ఉందన్నారు. మల్లన్నసాగర్ పూర్తి అయ్యిందని, కాల్వలు 90 శాతం మేర బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు మిగతా 10శాతం కాల్వలను భూమి సేకరించి వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నదని, స్పెషల్ ప్యాకేజీ తెచ్చి పనులు పూర్తి చేయాలన్నారు.
దీని గురించి అసెంబ్లీలో అడుగుతామన్నారు. ఈ యాసంగి పంటకు ఢోకా లేదని, నాలుగు జిల్లాలకు యాసంగి సాగుకు నీళ్లు రాబోతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారంగా అనేక రిజర్వాయర్లు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
గతేడాది ఆగస్టులోనే అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో చేప పిల్లలను వేశామన్నారు. ఈసారి సెప్టెంబర్ 20 దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేపపిల్లలను వదలడం లేదన్నారు. కేసీఆర్ కృషితో చెరువులు అభివృద్ధి చేసుకున్నామని, మత్స్యకారులు, ముదిరాజ్‌లు చేపలు పెంచి జీవిస్తున్నారన్నారు. కేసీఆర్ చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశారన్నారు. కాలం కాకపోయినా ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారన్నారు. అన్ని చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలి ముదిరాజ్‌లు, మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కాగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకుల పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. కార్యకర్తలపై, మీడియా ప్రతినిధులపై గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి రాయలేని భాషలో దుర్భాషలాడారు. బీఆర్ఎస్ బృందం పర్యటనలో ఆద్యంతం ఆటంకాలు సృష్టించారు. తిరుగు ప్రయాణంలో మల్లన్నసాగర్ కట్టపైన కనీసం ట్రాఫిక్‌ను కూడా క్లియర్ చేయలేదు.
తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
పారే గోదావరి జలాల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ కొలువై ఉన్నారు. ఆయన కీర్తిని చెరిపి వేయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రాజెక్టు నీళ్లతో పండే పంటలో, కూ డవెల్లి హల్దీ వాగులో పారె నీళ్లలో కేసీఆర్ ఉన్నాడు. ఎన్ని కుట్రలు, కుతాంత్రాలు చేసినా ప్రజల నుంచి కేసీఆర్‌ను వేరు చేయలేరు. తొలిసారి మల్లన్నసాగర్‌లోకి 21 టీఎంసీల జలాలు నింపుకోవడం చాలా సంతోషం.
పిల్ల కాలువలు పూర్తి చేయండి
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని
సాగునీళ్లు తెచ్చుకున్నాం. కాంగ్రెస్ నాయకులు కనీసం పిల్ల కాలువలు కూడా పూర్తి చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ని ర్మించిన ప్రాజెక్టులోకి పూ జలు చేసుకోవడానికి వస్తే అడ్డుకుంటారా. ఎవరెన్ని కు ట్రలు చేసినా ప్రాజెక్టులు, నీళ్లు అంటేనే కేసీఆర్ అని ప్రజలకు తెలు సు. తెలంగాణ సాధించుకున్నదే సాగునీళ్లు కోసం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టుల కట్టుకున్న ఘనత తెలంగాణ సొంతం. రైతుల మీద ప్రేమ, అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మిగిలిన కాలువలు కాంగ్రెసోళ్లు పూర్తిచేయాలి.
మాయమాటలు తేలిపోయాయి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకుల దుష్ర్పచారం చేశారు. ఇవ్వాళ మల్లన్నసాగర్‌లోకి వచ్చిన గోదావరి నీళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత ఏమిటో తెలిసిపోయింది. ప్రాజెక్టుల మూలంగా న ర్సాపూర్ నియోజకవర్గం లోకి గోదావరి నీళ్లు వస్తున్నాయి. కేసీఆర్ కట్టించిన అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లు నిండుకుండలా మారా యి. రిజర్వాయర్లలో గోదావరి జలాలను నింపుకోవ డం చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత మంది ఇప్పటికీ దుష్ర్పచారం చేస్తున్నారు. నీళ్లు తెచ్చిన కేసీఆర్, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
రైతు హితమే కేసీఆర్ ధ్యేయం
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
ప్రతిక్షణం రైతు హితమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేశారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని అబద్ధ్దపు ప్రచారం చేసిన కాం గ్రెస్ నాయకులకు మల్లన్నసాగర్లో నిండిన నీళ్లే సమాధానం చెబుతాయి. ఎంత సేపు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాలు చేయ డం తప్పా మరోటి లేదు. కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేయడం వల్లనే ఇవ్వాళ ఇక్కడ గోదావరి నీళ్లు మనకు కనిపిస్తున్నాయి.