గజ్వేల్, జూన్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా రైతులను మోసగించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుభరోసా వేస్తామంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరుగ్యారెంటీలు, వందల కొద్దీ ఇచ్చిన హామీలు అటకెక్కినట్లు విమర్శించారు.
గతేడాది వానకాలం, యాసంగి రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నట్లు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై మాజీమంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వెన్నులో వణకు పుడుతున్నదని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ కారు రేస్‌తో రాష్ట్ర ఖ్యాతిని పెంచింది కేటీఆర్ అని, హైదరాబాద్‌కు ఎలక్ట్రానిక్ మ్యాను ఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.
అందాల పోటీలతో దేశ ప్రతిష్టను రేవంత్ మంటగలిపారన్నారు. రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఓటుకు నోటు కేసు శుక్రవారం ఉండగా రేవంత్‌రెడ్డి గౌర్హాజరు అయ్యారని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు స్వామిచారి, అహ్మద్ పాల్గొన్నారు.