మెదక్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో బీజేపీతో కుస్తీ పడుతూ మున్సిపల్ ఎన్నికల్లో దోస్తీ చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జి ల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సే న్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మెదక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కాకుండా కుట్ర చేసి రెండు జాతీయ పార్టీలు పదవులు దక్కించుకోవడం సిగ్గుచేటన్నారు.
మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది వార్డు సభ్యులను ప్రజలు గెలిపించారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది వార్డు సభ్యులు గెలుపొందారన్నా రు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకుని పోలీసు అండతో ఎన్నికయ్యారన్నారు. మెదక్, నర్సాపూర్‌లో పోలీసుల అండ, అధికార బలంతో సభ్యుల సంఖ్య లేకపోయినా బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ సభ్యు లు చైర్పర్సన్, వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారన్నారు.
మెదక్‌లో జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో కోరం కోసం కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఉండి,చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు వెళ్లిపోయారన్నారు. బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీ య స్థాయిలో కాంగ్రెస్, బీఎస్పీలు ఉద్యమలు చేస్తే మెదక్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కలిసి బీఆర్ఎస్ సభ్యులు చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాకుండా కుట్ర చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బెదిరింపులకు గురిచేయడంతో పాటు అక్రమంగా పోలీసు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బెదిరించడంతో పాటు పోలీసుల సహకారంతో ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులు పాల్గొన్నారు.