సంగారెడి అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్‌రావు రాజకీయ ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ చిత్తవుతున్నది. సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. మూడు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీని వీడి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. బీజేపీ పార్టీ నాయకులు సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది బీఆర్ఎస్లో చేరారు. అల్లాదుర్గం బీజేపీ నేతలు, మాజీ జడ్పీటీసీ మమత, భర్త బ్రహ్మంతోపాటు నాయకులు ఆంజనేయులు, శేఖర్, మెదక్ జిల్లా యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు సాయిలుతోపాటు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు వంద మంది బీఆర్ఎస్లో చేరారు. జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, కొణింటి మాణిక్‌రావు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా పభాకర్ల సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
గారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్ద సంఖ్యలో నాయకులు చేరుతున్నారు. దసరా తర్వా త మరింత మంది నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంగం కాంగ్రెస్ జడ్పీటీసీ వినీల నరేశ్, కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ పి.బాలరాజ్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితోపాటు నియోజకవర్గంలోని 500 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీటీస ప్రేమలాదేవేందర్, హాంగిర్గా(కె) సర్పంచ్ యశోదా, ఉప సర్పంచ్ బీఆర్ఎస్లో చేరారు. జూకల్, వల్లూరు, రాయిపల్లి గ్రామాలకు చెందిన 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీటీసీ ఉమారాణి, ఆల్మాయిపేట సర్పంచ్ బాలమణి, వట్పల్లి పీఏసీఎస్ డైరక్టర్ ధర్మేందర్రావు, చౌటకూరు సర్పంచ్ మొగులయ్య, లక్ష్మీసాగర్ మాజీ ఉపసర్పంచ్ శివరామ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎర్రోళ్ల పోచయ్య, దేవిదాస్, చింత రవి, అల్లాదుర్గంకు చెందిన నక్క సూర్యకుమార్ బీఆర్ఎస్లో చేరారు. అందో లు నియోజకవర్గంలో మరింత మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ సమక్షంలో సదాశివపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. దసరా తర్వాత కాంగ్రెస్, బీజేపీ చెందిన మరింత మంది నాయకులు బీఆర్ఎస్లో చేరనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో ఇటీవల జిన్నారం, గుమ్మడిదల మండలాలతోపాటు పటాన్చెరు పట్టణానికి చెందిన పలువుర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీర్ఎస్లో చేరారు. మరింత మంది నాయకులు త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ బీఆర్ఎస్లో చేరికలు పెరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల వేళ సొంత పార్టీ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా, మండలస్థాయి నాయకులు బీఆర్ఎస్లోకి చేరుతుండటంతో కాంగ్రెస్ పెద్దలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్లోకి వలసలు పెరగకుండా ఏమి చేయాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన పడుతుంది. వలసల కారణంగా ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని, బలమైన నాయకులు పార్టీని వీడుతుండటం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి దారి తీసే ప్రమాదముందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతుంది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం తమ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు వలసపోవటంతో ఆందోళనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నేతలు పలువురు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. వరుసగా నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడుతుండటంతో బీజేపీ పెద్దలను కలవరపెడుతుంది.