మెదక్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/ మెదక్ అర్బన్ : మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోరు ముందు కాంగ్రెస్, బీజేపీ బేజారవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. శుక్రవారం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో హవేళీఘనపూర్ మండలంలోని సర్దన గ్రామానికి చెందిన కాంగ్రెస్ యు వజన కార్యదర్శి సంతోష్‌కుమార్, బీజేపీ బూత్ అధ్యక్షు డు పట్నం భువనేశ్వర్, కాంగ్రెస్ కార్యకర్త రామచంద్రాగౌడ్, గంగారం సహా పలువురు కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. తనను మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు రాగానే అది చేస్తా.. ఇది చేస్తామని ప్రజలను మభ్యపెట్టి, ఓట్లేయించుకుని మోసం చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తారన్నారు. ఔరంగాబాద్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దేవలాల్, బీజేపీ నాయకుడు జయరాంతోపాటు తండాకు చెందిన గిరిజనులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మెదక్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో హవే ళీఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో సర్పంచ్ పద్మావెంకట్, ఎంపీటీసీ యాదాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి యువతకు గులాబీ కండువా కప్పి, బీఆర్ ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తనయుడు పునీత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పోతుల రాజయ్య, సోషల్ మీడియా కన్వీనర్ రాజు, ముదిరాజ్ సంఘం సభ్యులు కావేరి సిద్ధిరాములు, భూషణం, చిత్తారి, వార్డు సభ్యురాలు కావేరీఆంజనేయులు పాల్గొన్నారు.