సిద్దిపేట, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండో విడత పంటరుణమాఫీ అంతా గందరగోళంగానే ఉన్నది. మొద టి విడత ఎలా ఉందో రెండో విడత కూడా అలానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి రెండో విడతలో కూడా చాలామంది రైతులకు పంటరుణమాఫీ కాలేదు. పంటరుణమాఫీ అవుతుందని ఆశపడిన రైతులకు నిరాశే మిగిలింది. లక్షన్నర వరకు ఉన్న రైతులకు పంటరుణమాఫీ చేశామని గొప్పలు చెప్పింది కానీ ఆచరణలో సా ధ్యం కాలేదు.
ఒక కుటుంబంలో లక్షన్నరలోపు ఉన్న వా రికి మాత్రమే పంట రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చె బుతున్నాయి. వీటి లో కూడా చాలా మందికి మెసేజ్లు రాలేదు. రెండో విడ త పంటరుణమాఫీకి సంబంధించిన జా బితాలను అధికారికంగా బ్యాంకు వాళ్లు విడుదల చేయలేదు. అటు వ్యవసాయశాఖ అధికారులు సైతం పంచాయతీలు, రైతు వేదికల వద్ద ప్రదర్శించలేదు. ప్రభు త్వ ఉద్యోగులకు పంటరుణమాఫీ కట్ చేశారు. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభు త్వ ఉద్యోగి ఉన్నా పంటరుణ మాఫీ కట్ అయినట్లు ఆ కుటుంబ రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు విడతలు కలిపి ..సిద్దిపేట జిల్లాలో 79, 721 మంది రైతులకు రూ. 558.61, మెదక్ జిల్లాలో 74,342 మంది రైతులకు రూ. 473.78, సంగారెడ్డి జిల్లాలో 77,951 మంది రైతులకు రూ. 563. 99 మొత్తం ఉమ్మడి జిల్లాలో రెండు విడతలు కలిపి 2,32,014 మంది రైతులకు రూ.1,596.38 రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.