చిలిపిచెడ్, ఫిబ్రవరి 14 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో కొంతమంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు.
పాఠశాలలో నీటి సమస్య ఉండడంతో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తాగునీరు అందించడంలో అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
దీనిపై పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయుడు సతీశ్‌ను వివరణ కోరగా.. పాఠశాలలో పెడుతున్న భోజనం మంచిగా ఉండడం లేదని కొంతమంది విద్యార్ధులు భోజనం, తాగునీరు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నది వాస్తమేనని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించడంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.